నేడు ఏలూరు జిల్లాకు వైయస్ షర్మిల రాక

నేడు ఏలూరు జిల్లాకు వైయస్ షర్మిల రాక

ELR: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏలూరు జిల్లాకు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గం పాలగూడెం పంచాయతీ పరిధిలోని రైతు సేవ కేంద్రం సమీపంలో అకాలవర్షాలకు కళ్లాలో ఉన్న ధాన్యం తడిసి తీవ్ర నష్టానికి గురైన రైతులను పరామర్శించడానికి ఆమె వస్తున్నారన్నారు.