మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ

మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ

JGL: గొల్లపెల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో జరుగుతున్న దొంగ మల్లన్న స్వామి జాతర సందర్భంగా స్వామి వారిని ఆదివారం ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పించి, ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు నాయకులు ఉన్నారు.