సిద్దేశ్వర ఆలయం హుండీ ఆదాయం ఎంతంటే..?

SRD: కంగ్టి సిద్దేశ్వర ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గురువారం హుండీ లెక్కించారు. ఆలయ ధర్మకర్త మండలి, గ్రామస్తుల ఆధ్వర్యంలో హుండీ లెక్కించగా రూ. 90,701 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి శివ రుద్రప్ప తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్, శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.