కళాశాల టాపర్లను సన్మానించిన MRO

కళాశాల టాపర్లను సన్మానించిన MRO

WGL: చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ మోడల్ స్కూల్/ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనపరిచి అద్భుత ఫలితాలు సాధించారు. ఈ క్రమంలో కాలేజ్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ హబీద్ అలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించి, వారిని అభినందించారు.