VIDEO: పలమనేరులో యువకుడు అనుమానాస్పద మృతి
CTR: పలమనేరులో ఓ యువకుడి మృతి కలకలం రేపింది. పట్టణంలోని బండ్ల వీధికి చెందిన మోహన్ కుమారుడు విష్ణు తేజ(28) వ్యవసాయ పనిముట్ల షాపు నిర్వహిస్తున్నాడు. నిన్న సాయంత్రం తన గదిలోకి వెళ్లాడు. ఎంతకీ బయటకు రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఒంటిపై 5 కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.