నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కొత్తగూడ సీఐ

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కొత్తగూడ సీఐ

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సీఐ సూర్యప్రకాష్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సీఐ కోరారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.