VIDEO: ఆకస్మికంగా మూడు పాడి ఆవులు మృతి..!
NGKL: వెల్దండ మండలంలోని తిమ్మినోని పల్లి గ్రామానికి చెందిన లింగం అనే రైతు వ్యవసాయ పొలంలో మూడు పాడి ఆవులు ఆకస్మికంగా మృతి చెందాయి. సోమవారం సాయంత్రం వ్యవసాయ పొలంలో ఉన్న ఆవులు ఆకస్మికంగా మృతి చెందినట్లు రైతు తెలిపారు. వర్షం సమయంలో పిడుగుపాటుకు మృతి చెంది ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లింది.