నన్ను ఆదుకోండి సారూ..!

కోనసీమ: వరదలతో తన ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిందని అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం పరిధిలోని న్యూ కాలనీకి చెందిన ముద్దన రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది క్రితం వచ్చిన వరదతో తన ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిందన్నాడు. ఇప్పటివరకు తనకు ఏ విధమైన పరిహారం అందలేదని, ప్రభుత్వం స్పందించి తన ఇంటి నిర్మాణానికి సహకారం అందించాలని బాధితడు కోరుతున్నాడు.