తీజ్ వేడుకలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్

NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం బాలెంపల్లి గ్రామంలో తీజ్ పండుగ వేడుకలు జరిగాయి. బంజారాల సాంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్ పండుగ వేడుకలలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.