తొలగించిన చెట్లను తరలించండి

తొలగించిన చెట్లను తరలించండి

ELR: నూజివీడు పట్టణంలోని నెహ్రూ పేటలోని గ్రంథాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో చెట్లను నరికి రోడ్డుకు ఇరువైపులా వేశారు. దీని వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. తొలగించిన చెట్ల వ్యర్థాలను తక్షణమే డంపింగ్ యార్డ్‌కు తరలించాలని స్థానికులు కోరుతున్నారు. చీకటి పడితే చెట్ల వ్యర్ధాలలోకి విషసర్పాలు, కీటకాలు చేరడం జరుగుతుందన్నారు.