మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య
SDPT: తొగుట మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. పులగూర్ల మల్లారెడ్డి (32) ఏప్రిల్ 2న వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి విషయంలో మనస్థాపానికి గురై పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. పెళ్లి పనుల కోసం అన్నతో కలిసి బయటకు వెళ్లి వచ్చిన మల్లారెడ్డి, ఆ తర్వాత ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.