BRS పార్టీలో చేరిన.. కాంగ్రెస్ నాయకుడు
BHPL: మండలం నేరేడుపల్లి గ్రామ 10వ వార్డు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జక్కుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సమక్షంలో ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మూగ రాజు, మాజీ ఎంపీటీసీ వేముల రాజేందర్, మాజీ సర్పంచ్ దానవేన రమేష్ ఉన్నారు.