VIDEO: 'మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలి'
SRPT: కాంగ్రెస్ పార్టీ తరపున మాదిగలకు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జనాభా ప్రాతిపదికన సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం చేయాలని, మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలని నేతలు రాజన్న, ఏపూరి రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.