ముగిసిన జిల్లా ఎస్ఎఫ్ఎ సమరభేరి సైకిల్ యాత్ర

యాదాద్రి భువనగిరి: ప్రభుత్వ విద్య పరిరక్షణకు, సంక్షేమ హాస్టళ్ల సంరక్షణకు జిల్లా ఎస్ఎఫ్ఎ సమరభేరి సైకిల్ యాత్ర 6 రోజుల పాటు 17 మండలాలలో 600 వందల కిలోమీటర్లు కొనసాగింది. భువనగిరిలో ప్రారంభమైన ఈ యాత్ర నేడు చౌటుప్పల్లో ముగిసింది. ఈ ముగింపు సభకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సాఫీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ఎల్ మూర్తి హాజరయ్యారు.