'వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'
VZM: కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న పలు వీధులలో ఎండలు దృష్టిలో పెట్టుకొని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు బుధవారం అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాలని సూచించారు. బయటకు వెళ్లినపుడు గొడుగులు, టోపీలు ధరించి వెళ్ళాలని కోరారు. తరచుగా కొబ్బరినీళ్లు,నిమ్మరసం వాడాలని పేర్కొన్నారు.