మిర్యాలగూడలో ఒక్క ఓటుతో విజయం

మిర్యాలగూడలో ఒక్క ఓటుతో విజయం

NLG: మిర్యాలగూడ 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు సంచలన విజయం సాధించారు. అత్యంత హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో సైదులుకు 837 ఓట్లు రాగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ ఉత్కంఠ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానంటూ, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.