అప్పుడే బుమ్రాకు నా రీల్స్‌లో ఛాన్స్: అర్ష్‌దీప్
కోహ్లీతో ఆర్ష్‌దీప్ చేసిన రీల్ ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. ఇలా ప్రతి మ్యాచ్ తర్వాత ఫన్నీ రీల్ చేసే అతను.. బుమ్రా మరికొన్ని వికెట్లు తీస్తేనే తన వీడియోలో కనిపించే అవకాశమిస్తానని సరదాగా అన్నాడు. కాగా అర్ష్‌దీప్(107) తర్వాత 100+ T20I వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్‌గా బుమ్రా(101) నిలిచాడు. అలాగే వీరిద్దరూ కలిసి ఆడిన 14 T20ల్లో భారత్ ఒక్కటీ ఓడలేదు.