జీయర్ స్వామి జాతర రథోత్సవం

జీయర్ స్వామి జాతర రథోత్సవం

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో జీయర్ స్వామి జాతర ఉత్సవాలు భక్తి పరవశంతో కొనసాగుతున్నాయి. నేడు నిర్వహించిన శ్రీవేంకటేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. రథాన్ని గ్రామ వీధుల గుండా తీసుకెళ్లగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణలతో గ్రామమంతా మారుమోగింది.