నిరుద్యోగులకు ఉచిత శిక్షణ: పీవో రాహుల్
BDK: డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్ (కంప్యూటరు హార్డ్‌వేర్) కోర్సుల్లో శిక్షణ ఉంటుందని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు రెండు నెలల పాటు భోజన వసతితో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు, శిక్షణ అనంతరం ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.