పరిశ్రమల స్థాపనకు సమన్వయంతో కృషి చేయాలి: కలెక్టర్
సత్యసాయి: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అధికారులు సమన్వయంగా కృషి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పెట్టుబడి రాయితీ కింద 17 పరిశ్రమలకు రూ.12.46 కోట్లు మంజూరు చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులకు నిర్ణీత కాలంలో అనుమతులు ఇవ్వాలన్నారు.