VIDEO: ఆసుపత్రిని ధ్వంసం చేసిని వైసీపీ నేతలు
అనంతపురంలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. సాయినగర్‌లో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని తమకు అప్పగించాలని సుమారు 30 మందితో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మరో మూడు రోజుల్లో ఆసుపత్రి ప్రారంభించనుండగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితులు వాపోయారు. దాదాపు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇందుకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.