BREAKING: బైకును ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

BREAKING: బైకును ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

MDCL: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.