VIDEO: భారీ వర్షానికి జలమయమైన రహదారులు

VIDEO: భారీ వర్షానికి జలమయమైన రహదారులు

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలలో మురికి కాలువలు పొంగిపొర్లాయి. అంబేడ్కర్ చౌక్ నుంచి కిసాన్ చౌక్ వరకు రోడ్లు చెరువులను తలపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్నత అధికారులు ప్రజలను జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.