'ఫొటోలు తీయడం ఒక కళ.. ఆ కళను బలోపేతం చేయాలి'

ASR: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాడేరులో ఘనంగా నిర్వహించారు. ఫొటోలు తీయడం ఒక కళ అని, ఆ కళను మరింత బలోపేతం చేయాలని ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, గౌరవాధ్యక్షుడు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ పేర్కొన్నారు. ఫొటో గ్రాఫర్లు తమ కళను విస్తృతం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.