జిల్లాలో వాణిజ్య దుకాణాలకు బహిరంగ వేలం..!

జిల్లాలో వాణిజ్య దుకాణాలకు బహిరంగ వేలం..!

VSP: GVMC జోన్-3 పరిధిలో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, కమ్యూనిటీ హల్‌కు డిసెంబర్ 9న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ శివ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు GVMC జోన్ - 3 జోనల్ ఆఫీసు వద్ద ఆరోజు ఉదయం 11 గంటలకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు జోనల్ కార్యాలయాన్ని పని వేళల్లో సంప్రదించాలన్నారు.