క్రెడిట్ అంతా బ్యాటర్లదే: కెప్టెన్ సూర్య

క్రెడిట్ అంతా బ్యాటర్లదే: కెప్టెన్ సూర్య

ఆస్ట్రేలియాపై విజయం క్రెడిట్ అంతా భారత బ్యాటర్లకే దక్కుతుందని కెప్టెన్ సూర్యకుమార్ అన్నాడు. ముఖ్యంగా, బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై అభిషేక్, గిల్ పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసిన తీరును మెచ్చుకున్నాడు. బ్యాటర్లు సమిష్టిగా రాణించారని తెలిపాడు. అలాగే బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ కూడా విజయానికి దోహదపడిందన్నాడు. ఇది సమిష్టి విజయమని పేర్కొన్నాడు.