VIDEO: కర్మన్‌ఘాట్ హనుమాన్‌కు అభిషేకం
TG: హైదరాబాద్ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక సింధూర అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, పలు రకాల పండ్లు కలిపి సుమారు 108 లీటర్లతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని అద్భుతంగా అలంకరించి మంగళహారతి ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.