రోడ్లమీద గుంతలు పూడ్చిన అధికారులు
AKP: నర్సీపట్నం చింతపల్లి ప్రధాన రహదారిలో తిరిగే వాహన చోదకులకు ఇది నిజంగా శుభవార్త. డీఎస్పీ బంగ్లా దగ్గరలో ప్రధాన రహదారికి గోతులు పడి అనేక మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించారు. మంగళవారం రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు.