'హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది'
NRML: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం కుబీర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో (MRO) కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందన్నారు.