ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్
PLD: దుర్గి మండల పరిధిలోని దుర్గి, ధర్మవరం విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని ఓబులేశునపల్లె, ధర్మవరం, జంగమహేశ్వరపాడు, శ్యామరాజుపురం, దారివేముల గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సీతారామ్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని వారు కోరారు.