జిల్లాలో తుది ఓటరు జాబితా రెడీ

MBNR: గ్రామపంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో తుది ఓటరు జాబితాను అధికారులు మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తంగా 4,99,582 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,48,222 మంది పురుషులు, 2,51,349 మంది మహిళలు ఉన్నారు. కాగా, ఇతర ఓటర్లు 11 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.