మహబూబాబాద్ ఏజీపీగా శ్రీనివాస్ గౌడ్ నియామకం

MHBD: మహబూబాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్ నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. గత 19 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా మహబూబాబాద్ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆరెల్లి శ్రీనివాస్‌కు ప్రభుత్వం ఏజిపీగా నియమించింది.