నేడు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

నేడు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

PLD: ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియ పూర్తయిందని తహసీల్దార్ నగేష్ బుధవారం తెలిపారు. ఈ మేరకు గురువారం అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 9వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రైతులు ముందుగా e-KYC పూర్తి చేసుకుని తమ పాసు పుస్తకాలను స్వీకరించాలని ఆయన కోరారు.