VIDEO: '12 కేజీలు గంజాయి పట్టివేత'
SKLM: సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్సై పారి నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా, వారి నుంచి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మంగరాజు తన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.