100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ప్రదర్శన
BPT: చీరాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో సుమారు 1000 మంది విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా.. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యువతకు మాదక ద్రవ్యాల వల్ల దేశానికి జరుగుతున్న నష్టాన్ని వివరించారు. నవ భారత్ నిర్మాణానికి, దండి మార్చ్ 2.0కు సహకరించాలని కోరారు. ఈగల్ టీం సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.