దిత్వా తుఫాన్ ఎఫెక్ట్: జిల్లాకు భారీ వర్షాలు
అన్నమయ్య: దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండంతో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్‌ను జారీ చేసింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, తీరం వెంబడి గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.