మందుబాబులకు అడ్డాగా మారిన పాఠశాల

NGKL: కొల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ మోడల్ ఉన్నత పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. ఈ పాఠశాల గ్రామానికి వెలుపల ఉండడం చేత చీకటి పడితే చాలు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పలువురు మండిపడ్డారు. విద్యాబుద్ధులు నేర్చుకునే ఈ దేవాలయంలో మందు తాగుతూ.. సీసాలు పగలగొడుతూ.. విచ్చలవిడిగా పడవేశారు.