కన్నుల పండువగా సీతారామ కల్యాణం

విజయనగరం: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నెల్లిమర్ల రామతీర్థంలో శ్రీసీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల సమయంలో ఉత్సవ విగ్రహాలను మేళతాలలతో ఊరేగింపుగా కల్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. పట్టువస్త్రాలు, పలురకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కల్యాణం జరిపించారు.