నగరంలో వర్షం.. IPL మ్యాచ్ జరిగేనా..?
హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భానుడి ప్రతాపానికి గురైన వారికి ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే, ఇవాళ ఉప్పల్లో IPL మ్యాచ్ ఉండడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.