నగరాన్ని వణికిస్తున్న చలి

నగరాన్ని వణికిస్తున్న చలి

HYD: నగరంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో 14.7, మచ్చబొల్లారం, గచ్చిబౌలిలో 15 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని హెచ్చరించింది. ప్రజలు, చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, చలి గాలుల వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచించారు.