రేపు మెగా జాబ్ మేళా
SKLM: పలాసలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 12 పరిశ్రమలు పాల్గొని 400 పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.