వంగర KGBVకు అరుదైన గుర్తింపు

VZM: రాష్ట్ర స్థాయిలో వంగర KGBVకు ఉత్తమ అవార్డు లభించడం పట్ల కలెక్టర్ అంబేద్కర్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. జిల్లా విద్యా వ్యవస్థకు ఇది గర్వ కారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 352 KGBVలలో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, విద్యార్ధుల సరాసరి మార్కులను పరిగణనలోకి తీసుకుని టాప్ 10 పాఠశాలల్లో వంగర KGBV ఒకటిగా నిలిచిందన్నారు.