పోరుమామిళ్ల సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

పోరుమామిళ్ల సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

కడపలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోరుమామిళ్లలోని సమస్యలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి బద్వేల్, మైదుకూరు రోడ్డు వరకు రోడ్డు పక్కన ఆక్రమణల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్‌ను కోరారు.