ఈతకు వెళ్తున్నారా.. జాగ్రత్త

తిరుపతి: వేసవి సెలవుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, బావులు, నదులు, డ్యాముల పరివాహిక ప్రాంతాల్లో పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో జిల్లా అధికారులు స్పందించి ముందస్తు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్ద వహించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.