తిరుమలలో ఏప్రిల్ నెల విశేష పర్వదినాలు

తిరుమలలో ఏప్రిల్ నెల విశేష పర్వదినాలు

TPT: ఏప్రిల్ నెలలో తిరుమలలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్ 1న శ్రీ‌వారి వసంతోత్సవాల సమాప్తితో పాటు తుంబూరు తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13న శ్రీభాష్యకారుల ఉత్సవాలు, ఏప్రిల్ 20న అక్షయ తృతీయ, పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరునక్షత్రం, శ్రీనివాస దీక్షితుల వర్ష తిరునక్షత్రం జరుపుకుంటారు.