దుందుభి నదిపై వంతెన నిర్మాణానికి కృషి: ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద దుందుభి నదిపై హై లెవెల్ వంతెనను నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. మన్నెవారిపల్లి- దేవరకొండ మార్గంలో దుందుభి వాగుపై రాకపోకలు నిలిచిపోవడంతో స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సాకారంతో మన్నెవారిపల్లి వద్ద వంతెనను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.