ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
కోనసీమ: పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, సోదరభావానికి ప్రతీక అని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. మంగళవారం వేమవరం సత్యనారాయణ కళ్యాణ మండపంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు.