శ్రీ కనకదుర్గమ్మ సేవలో మంత్రి
SKLM: విజయవాడలో ప్రసిద్ధి గాంచిన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో మంత్రిను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.