VIDEO: కార్తీక అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ సీపీ

VIDEO: కార్తీక అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ సీపీ

విశాఖ 89వ వార్డు భగత్ సింగ్ నగర్‌లో గౌరీ కేదారేశ్వర ఆలయంలో కార్తీక అన్నసమారాధన ఘనంగా జరిగింది. సీపీ శంఖబ్రత భాగ్చి, సీఐ సన్యాసినాయుడు కార్యక్రమంలో పాల్గొని ఆలయాన్ని సందర్శించారు. కోనేరు పక్కన ఉన్న ఆహ్లాదకర వాతావరణపు ఆలయాన్ని సీపీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. కమిటీ సభ్యులు కృష్ణచారి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.