VIDEO: 'రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి'

VIDEO: 'రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి'

ADB: గుడిహత్నూర్ మండలంలోని కోలంగూడ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీపీఆర్వో ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన, వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత ప్రదర్శన చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పాటల ద్వారా చైతన్య పరిచారు.